గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (11:31 IST)

ఉగాది రేసులో చిరంజీవి "ఆచార్య"

మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "ఆచార్య". ఈ చిత్రం గత యేడాదే విడుదల చేయాల్సివుంది. ఆ తర్వాత ఫిబ్రవరి అనుకున్నారు. ఇపుడు మరోమారు ఉగాది రేస్‌లోకి వెళ్లింది. ఉగాది కానుకగా ఏప్రిల్ ఒకటో తేదీన ఆచార్య చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రం బృందం ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల్ ప్రొమక్షన్ అధికారికంగా ట్వీట్ చేసింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదావేస్తున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే, ఇలా ప్రకటించి 24 గంటలు గడవకముందే ఏప్రిల్ ఒకటో తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ చిత్రం ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కావాల్సివుంది. కానీ, కరోనా ఉధృతి దృష్ట్యా సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నారు.