గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (18:21 IST)

చిరంజీవి ఫ్యాన్సుకు బ్యాడ్ న్యూస్.. ఆచార్య రిలీజ్ వాయిదా

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్సుకు బ్యాడ్ న్యూస్. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ నక్సలైట్లుగా నటిస్తున్నారు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  
 
ఈ నేపథ్యంలో ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతికి ఆచార్య నుంచి గుడ్ న్యూస్ వస్తుందనుకుంటే.. మెగా ఫ్యాన్సుకు బ్యాడ్ న్యూసే వచ్చింది. ఆచార్య సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఆచార్య  విడుదల కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. 
 
గతేడాదే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. 2022 ఫిబ్రవరి 4న ఆచార్య విడుదల అవుతుందని మెగా ఫాన్స్ సంబరపడ్డారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఆచార్య సినిమా మరోసారి వాయిదా పడింది. ఆచార్య సినిమా విడుదల వాయిదా వేశామని చిత్ర బృందం శనివారం (జనవరి 15) అధికారికంగా ప్రకటించింది. 
 
'కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆచార్య సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిసస్తాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కరోనా రూల్స్ పాటిస్తూ అందరూ జాగ్రతగా ఉండండి' అని కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన మెగా ఫాన్స్ నిరాశకు గురయ్యారు. పాన్‌ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల జాబితాలో తాజాగా ఆచార్య మూవీ కూడా చేరింది.