బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (12:33 IST)

"రాధేశ్యామ్" విడుదల వాయిదా? దర్శకుడు రాధాకృష్ణకుమార్ ట్వీట్ వైరల్

ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ "రాధేశ్యామ్". ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సివుంది. అయితే, ఈ చిత్రం విడుదల వాయిదాపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై దర్శకుడు రాధాకృష్ణకుమార్ చేసిన ట్వీట్ ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
"సమయాలు కఠినమైనవి. హృదయాలు బలహీనంగా ఉంటాయి. మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా... మన ఆశలు ఎల్లపుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి.. ఉన్నతంగా ఉండండి... టీమ్ రాధేశ్యామ్" అంటూ ట్వీట్ చేశారు. 
 
అంటే ఈ ట్వీట్ రాధేశ్యామ్ చిత్రం వాయిదాపడుతుందన్న సందేశాన్ని తెలిపేలా వుంది. ఇక ఇదే విషయాన్ని దర్శకుడు వద్ద ప్రస్తావించగా, అలాంటిదేమైనా ఉంటే ఖచ్చితంగా ప్రకటిస్తాం అని ముక్తసరిగా సమాధానమిచ్చారేగానీ, స్పష్టం చేయకపోవడం గమనార్హం. అంటే రాధేశ్యామ్ ఖచ్చితంగా వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి.