మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 25 డిశెంబరు 2021 (20:22 IST)

జ్యోతిష్కులు రాధే శ్యామ్ గురించి ఏమి చెప్పారో తెలుసా

Radhe syam- Radha krishna
రెబ‌ల్ స్టార్ డా. యు.వి. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో గ్లోబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ‌లు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌లు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి  సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. 
 
ఈ భారీ ల‌వ్లీ విజువ‌ల్ వండ‌ర్ ని ఏక‌కాలంలో ఐదు భాష‌ల తో పాటు చైనీస్, జపనీస్ భాషల్లోనూ భారీ రేంజ్ లో విడుదల చేస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా రాధే శ్యామ్ గురించి ద‌ర్శ‌కుడు ఇలా తెలియ‌జేశారు.
 
రాధే శ్యామ్ క‌థ జాత‌కాల గురించి క‌దా. దీనిపై ఎవ‌రెవ‌రిని క‌లిశారు?
ఈ క‌థ‌పై ప‌రిశోధ‌న చేసేట‌ప్పుడు చాలా మంది జ్యోతిష్కులం క‌లిశాం. ఆ టైంలో ఓ జ్యోతిష్యుడుకి క‌థ చెప్పాం. ఆయ‌న ఈ సినిమా గురించి చెబుతూ, 2022 ఫ‌స్టాఫ్‌లో విడుద‌ల‌వుతుంద‌ని అన్నారు. మాకు కాస్త ఆశ్చ‌ర్యం వేసింది. పామాలిస్ట్ క‌థ గ‌నుక ఇది క‌రెక్టే అనుకున్నాం. ఆ టైంలో కోవిడ్ అనేది లేదు. ఇప్పుడు విడుద‌ల తేదీ చూస్తుంటే మాకు నిజ‌మేన‌ని తెలిసింది. రేపు సినిమా చూశాక మీరే చెబుతారు అని అన్నారు.