శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (22:47 IST)

ప్ర‌భాస్ కోస‌మే రాధేశ్యామ్ రాసిపెట్టి వుంది- ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌

Prabhas-Radha krishana-pooja
రాధేశ్యామ్ చిత్రంలో ప్ర‌భాస్‌, పూజా హెగ్డేలు ఈ సినిమాకే పుట్టార‌నేలా వున్నార‌ని చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ తెలియ‌జేశారు. గురువారం రాత్రి ప్రీరిలీజ్ వేడుక‌లో ఆయ‌న మాట్లాడుతూ, ఈ సినిమా కోసం ఎనిమిది ఏళ్ళు ప‌ట్టింది. క‌థ‌కు ముగింపు దొర‌క‌డంలేదు. ఆ టైంలో ఏలేటిగారు క‌లిశాం. జాత‌కాల‌పై క‌థ కాబ‌ట్టి ఇది ఎవ‌రికి రాసిపెట్టి వుందో అన్నారు. ఆఖ‌రికి ఇది ప్ర‌భాస్‌కు రాసిపెట్టి వుంది అన్నారు. ప్ర‌భాస్‌తో సినిమా చేద్దామ‌నుకున్న‌ప్పుడు చాలెంజ్ గా అనిపించింది.
 
ఫిలాస‌ఫీని ల‌వ్‌స్టోరీగా రాశాక ప్ర‌భాస్‌కు చెప్పాం. ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. ఇందులో ఫైట్లు వుండ‌వు. అబ్బాయికి అమ్మాయికి మ‌ధ్య జ‌రిగే యుద్ధాలుంటాయి.  అమ్మాయికోసం ఏడు స‌ముద్రాలు ఈది వెళ్ళే జ‌ర్నీ ఇందులో వుంటుంది అన్నారు.
 
_ ప్ర‌భాస్‌నుద్దేశించి మాట్లాడుతూ, మీరు సూప‌ర్‌స్టార్ కాదు సార్‌. మీరు యూనివ‌ర్స‌ల్ స్టార్‌. ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయారు. మీలాంటి ఫ్రెండ్ అంద‌రికీ వుండాలి. గురువుగాకూడా వుండాలి. నాకు చాలా విష‌యాలు చెప్పారు అని తెలిపారు.