రాధేశ్యామ్ క్లయిమాక్స్ హైలైట్- ప్రభాస్
Krishnam raju, prabhas, naveen
- సత్యరాజ్, పెద్ద నాన్న, జయరాం, సచిన్, భాగ్యశ్రీకి ధన్యవాదాలు. కెమెరామెన్ మనోజ్ అందంగా చూపించాడు. జగపతిబాబు గెస్ట్‌గా చేశారు. పూజా కూడా అందంగా వుంది. ఈ ఈవెంట్‌కు పోలీసులు చాలా సహకరించారు.
- దర్శకుడు రాధాకృష్ణ ఐదేళ్ళు ఈ సినిమాపై దృష్టి సారించారు. బాహుబలి అయ్యాక సాహో తర్వాత ఈ సినిమా మొదలు పెట్టాం. కొద్దిరోజుల చేశాక ఆపి, మరలా చేసి, మరలా ఆపి.. ఇలా చికాకు పుట్టినా ఓపికగా సినిమా పూర్తి చేశాం. ఈ సినిమాలో చాలా మలుపులు వున్నాయి. క్లయిమాక్స్ హైలైట్ అవుతుందని చెప్పగలను. జనవరి 14న చూడండని తెలిపారు.
