మంగళవారం, 21 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 18 అక్టోబరు 2025 (18:55 IST)

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

Man was beaten and handed over to police
ఓ కామాంధుడు ఆసుపత్రిలో నర్సుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఒక్క రాత్రికి రూ. 10,000 ఇస్తాను, నాతో పడుకుంటావా అంటూ నేరుగా నర్సును అడిగాడు. దాంతో అతడిని ఏం చేయాలో అదే చేసారు.
 
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ సిఎంఐ ఆసుపత్రిలో నర్సులను ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. నర్సులు పనిచేసే వార్డుల్లోకి ప్రవేశించిన ఈ కామాంధుడు... వారితో రోజుకి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా అంటూ అసభ్యంగా మాట్లాడాడు. అతడి చెడు ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం చెందిన నర్సులు, సిబ్బంది అతడిని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు.