మంగళవారం, 21 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2025 (10:25 IST)

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

vishal makutam
హీరో విశాల్ కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తూ వచ్చిన డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ దర్శకత్వం బాధ్యతలను విశాల్ స్వీకరించారు. దీపావళ పండుగ వేళ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. విశాల్ నటిస్తున్న తాజా చిత్రం మకుటం. తమిళం, తెలుగు భాషల్లో  తెరకెక్కుతోంది. రవ అరసు దర్శకుడు. అయితే, దర్శకుడు - హీరోకు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి దర్శకుడు తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను విశాల్ స్వీకరించారు. ఈ విషయాన్ని దీపావళి పండుగ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. బహిర్గతం చేసే సమయం ఆసన్నమైందని, ఇకపై రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని అందులో పేర్కొన్నారు.  
 
'అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక సందర్భంలో 'మకుటం' మూవీ సెకండ్ లుక్‌ను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకి నేను దర్శకత్వం వహిస్తానని ఊహించలేదు. పరిస్థితుల కారణంగా బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందే తప్ప ఇందులో ఎవరి బలవంతం లేదు. కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోవడమంటే బాధ్యతను స్వీకరించడమే. సినిమా అంటే కమిట్మెంట్. మనల్ని ఆదరించే ప్రేక్షకులు, డబ్బు పెట్టే నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అందుకే రీవర్క్ చేసి, ఈ సినిమాని తీసుకొస్తున్నా. ఇది కొత్త ప్రయాణం' అని పేర్కొన్నారు. కాగా, విశాల్ హీరోగా నటించే 35వ చిత్రం. నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్‌కు 99వ చిత్రం.