సల్మాన్ స్పూర్తితో అఖిల్ కండలు పెంచాడట!
అక్కినేని వారసుల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో పలకరించిన అఖిల్ తాజాగా కండలు చూపిస్తున్నాడు. ఇది ఏజెంట్ అనే సినిమా కోసమే అని చెబుతున్నాడు. గతంలోనే తాను చేయబోయే ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవల్‌లో వుంటుందని వెల్లడించారు. తాజాగా ఈరోజు అఖిల్ కండలు పెంచిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాహుబలిలో రానా తరహాలో కండలు పెంచినట్లున్న అఖిల్ కండలు స్పూర్తి మాత్రం సల్మాన్ ఖాన్ అని తెలుస్తుంది. ఈరోజు సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సహజంగా కండలు కోసం జిమ్‌కు వెళ్ళి కష్డపడుతుంటారు. దానికోసం రకరకాలుగా పుడ్‌ను మెయింటెన్ చేస్తుంటారు. అఖిల్ తాజా సినిమా ఏజెంట్ లో గూఢచారిగా నటిస్తున్నాడు. జేమ్ష్ బాండ్ తరహాలో స్టయిలిష్ లుక్ కాకపోయినా కండలతో అలరించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. పొడవాటి జుట్టు, దట్టమైన గడ్డంతో తన కండరపుష్టిని పిక్ లో చూపించాడు.
తాజాగా మొదటి షెడ్యూల్ షూటింగ్ జరిగింది. ఏజెంట్ సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. సురేందర్ రెడ్డి దర్శకుడు కాగా, సాక్షి వైద్య కథానాయిక. మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కూడా నటిస్తున్నాడు. 20222 సమ్మర్‌లో మీ ముందుకు వస్తున్నట్లు అఖిల్ పోస్ట్‌లో తెలియజేశాడు.