బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 డిశెంబరు 2021 (13:32 IST)

పాముకాటుకుగురైన బాలీవుడ్ స్టార్ హీరో?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యారు. శనివారం రాత్రి పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఆయన్ను పాము కరిచింది. ప్రస్తుతం ఆయన నవీ ముంబైలోని కమోతేలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం భేషుగ్గా వుంది. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను ఇంటికి పంపించారు. సల్మాన్‌ను కరిచిన పాము విషపూరితం కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 
 
ఇదిలావుంటే, ఈ నెల 27వ తేదీ సోమవారం సల్మాన్ ఖాన్ తన 56వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. ప్రస్తుతం ఈయన బిగ్ బాస్ హిందీ 15వ సిరీస్‌కు హోస్ట్‌గా కొనసాగుతున్నారు. అలాగే, ఈ వీకెండ్ వార్ ఎపిసోడ్‌లో "ఆర్ఆర్ఆర్" టీమ్ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, అలియా భట్‌లు పాల్గొని సందడి చేశారు. ఈ వేదికపైనే సల్మాన్ ఖాన్ ముందస్తు పుట్టిన రోజు వేడుకలు జరుగగా ఈ సినీ సెలెబ్రిటీలంతా పాల్గొన్నారు.