మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (16:35 IST)

కృష్ణా జిల్లా డోకిపర్రులో చిరంజీవి: గోదాదేవి కల్యాణంలో..?

సంక్రాంతి వేడుకల్లో సెలెబ్రిటీలు బిజీ బిజీగా వున్నారు. మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సంబురాల్లో పాలుపంచుకున్నారు. భోగి పండుగ రోజు సాయంత్రం కృష్ణా జిల్లా డోకిపర్రు వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణోత్సవానికి భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు చిరంజీవి. 
 
ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. చిరంజీవి దంపతులతో పాటు మేఘా కృష్ణారెడ్డి కుటుంబం కూడా ఈ కల్యాణంలో పాల్గొంది. చిరంజీవి ఈ ఆలయానికి వచ్చారని తెలిసి భారీగా అభిమానులు తరలివచ్చారు. 
 
మేఘా కన్స్‌స్ట్రక్షన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి ఆయన సొంతూరు కృష్ణా జిల్లా డోకిపర్రులో అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించారు. అప్పటి నుంచి ఆ ఆలయం పుణ్యక్షేత్రంగా మారింది. రోజూ ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. పండగల సమయాలలో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
 
భోగి పండుగ సందర్భంగా సాయంత్రం గోదాదేవి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ దంపతులు హాజరయ్యారు. భార్య సురేఖతో కలిసి చిరంజీవి కృష్ణా జిల్లా డోకిపర్రులో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు.