శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 జనవరి 2022 (13:21 IST)

సీఎం జగన్‌గారు సావధానంగా విన్నారంటూ చిరంజీవి స్వీట్ వార్నింగ్

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన సినీ పరిశ్రమ సమస్యలను వివరించారు. సీఎం జగన్‌కు అనేక సమస్యలను ఆయన వివరించారు. ఆ తర్వాత చిరంజీవి మాట్లాడుతూ, జగన్ నేను చెప్పిన సినీ పరిశ్రమలోని సమస్యలను ఆలకించారు. త్వరలో వాటిపై అందరికి ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకుంటాను అని చెప్పారు. 
 
అలాగే ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మళ్ళీ వచ్చి చెప్పమన్నారు. ఈ నెలాఖరులోపు ఈ సమస్యకి పరిష్కారం వస్తుందని అని అన్నారు. పైగా, తాను చిత్రపరిశ్రమ పెద్దగా సీఎం జగన్ వద్దకు వెళ్లలేదని, ఒక బిడ్డగా మాత్రమే వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. ఎవరూ తొందరపడి అభద్రతా భావంతో మాటలు జారొద్దు. ఎవరు పడితే వాళ్లు మాట్లాడొద్దు. స్టేట్మెంట్లు ఇవ్వొద్దు. కొన్ని రోజుల పాటు సంయమనం పాటించండి. 
 
జగన్ గారు త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారు. నేను అందరి తరపున మన సమస్యల్ని వివరించారు. ఈ మీటింగ్‌లో ఏం జరిగింది. జగన్ గారు నాకు చెప్పినవన్నీ ఇండస్ట్రీ ప్రముఖులతో సమావేశం పెట్టి అందరికీ చెప్తాను. మీరు ఏమైనా సమస్యల్ని చెప్తే అవన్నీ విని మళ్లీ జగన్‌గారిని కలుస్తాను. త్వరలోనే దీనికి ఫుల్‌స్టాఫ్ పడుతుంది అని చిరంజీవి అన్నారు.