గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , గురువారం, 13 జనవరి 2022 (16:19 IST)

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌గా సీఎం జ‌గ‌న్ తో మెగాస్టార్ చిరంజీవి బేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి క‌లిశారు. తాడేప‌ల్లిలోని సీఎం నివాసంలో ఆయ‌న‌తో భేటీ అయ్యారు. సీఎం జ‌గ‌న్, మెగాస్టార్ చిరంజీవి లంచ్ చేస్తూ, చ‌ర్చించేలా ఈ లంచ్ మీటింగ్ ను ఏపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇటీవ‌ల సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై వ‌చ్చిన ప్ర‌తిష్ఠంభ‌న‌ను తొలగించేందుకే మెగాస్టార్ చిరంజీవి సీఎం జ‌గ‌న్ ను క‌లిసేందుకు వ‌చ్చారు. ఆయ‌న హైద‌రాబాదు నుంచి గన్నవర విమానాశ్రయానికి చేరుకుని, అక్క‌డి నుంచి నేరుగా సీఎం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయల్దేరారు. 
 
 
సీఎం జ‌గ‌న్ మెగాస్టార్ ని సాద‌రంగా ఆహ్వానించారు. చిరంజీవి సీఎంకు పుష్ప‌గుచ్చం అందించి, శాలువా క‌ప్పి స‌న్మానించారు. అనంత‌రం ఇద్ద‌రు లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. సీఎం ఆహ్వానం మేరకు సినీ పరిశ్రమ పెద్దగా వచ్చానని చిరంజీవి మీడియాకు తెలిపారు. వారిద్ద‌రు చ‌ర్చించి త‌ర్వాత సినీ స‌మస్య‌ల‌న్నింటికీ ఒక ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నారు.