బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (14:09 IST)

ఆర్జీవీ సంచలన ట్వీట్.. మంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చినా?

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీకి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని అపాయింట్‌మెంట్ ఇచ్చారని ఆర్జీవీ స్వయంగా ట్విట్టర్‌లో ధృవీకరించారు.

"జనవరి 10 మధ్యాహ్నం అమరావతి సచివాలయానికి గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి నన్ను ఆహ్వానించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఏపీ టికెట్ ధరపై సహృద్భావ పరిష్కారం కోసం మీ దయతో కూడిన చొరవకు ధన్యవాదాలు" అంటూ ఆర్జీవీ నిన్న ట్వీట్ చేశారు. గత వారం రోజులుగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచాలనే డిమాండ్‌కు సపోర్ట్ చేస్తూ ఆర్జీవీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 
 
అయితే మంత్రి పేర్ని నానితో చర్చకు ముందే మరోసారి వివాదాస్పద ట్వీట్ చేశాడు. చలనచిత్రాలు, థీమ్ పార్కులు, సంగీత కచేరీలు, మ్యూజిక్ షోలు వంటివి కూడా వినోద సంస్థల కిందకు వస్తాయని.. ఆ ధరల్ని ప్రభుత్వం నిర్ణయించజాలదని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. మరో రెండ్రోజుల్లో సినిమా టికెట్ ధరల అంశంపై మంత్రిని కలవనున్న ఆర్జీవీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతమనే విమర్శలు వస్తున్నాయి. తెగేవరకూ లాగేందుకే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.