గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (11:17 IST)

లైఫ్‌‌లో ఫస్ట్ టైం నీకు నెగిటివ్‌గా రావాలని కోరుకుంటున్నా: నితిన్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భార్య శాలిని కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే శుక్రవారం ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమెకు బర్త్ డే సెలెబ్రేషన్స్ చేశాడు. ఇంట్లో పైన ఒక రూమ్‌‌‌‌లో ఉంటున్న శాలిని కిటికి లోంచి చూస్తూ ఉండగా.. కింద గార్డెన్ ఏరియాలో నితిన్ తన కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేశాడు. 
 
ఇలా దూరం దూరంగా ఉండి నితిన్ తన వైఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోని నితిన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. "కోవిడ్ కి సరిహద్దులు ఉన్నాయేమో, మన ప్రేమకి సరిహద్దులు లేవు, హ్యాపీ బర్త్ డే టు మై లవ్. లైఫ్‌‌లో ఫస్ట్ టైం నీకు నెగిటివ్‌గా రావాలని కోరుకుంటున్నాను" అంటూ పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.