గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (08:31 IST)

సింగర్ సునీత గర్భవతి అయ్యిందా?

సింగర్ సునీతపై కొత్త పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సింగర్ సునీత గర్భవతి అనే పుకార్లు పుట్టించారు. ఈ విషయంలో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఫిలిమ్ నగర్ వర్గాల్లో ఈ వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. అంతేగాకుండా సునీత సరోగసి ద్వారా పిల్లలను కనాలని నిర్ణయించుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక సునీత రెండో భర్త రామ్ పెద్ద డిజిటల్ కంపెనీకి ఓనర్ అనే సంగతి తెలిసిందే. 
 
అయితే డిజిటల్ కంపెనీలోకి సునీత కూడా ఎంటర్ కానుందట. అయితే సింగర్ సునీత భర్త రామ్ కంపెనీ చిన్న చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉన్నారట. అయితే తన భార్య సునీతనే నిర్మాతగా వ్యవహరించే విధంగా రామ్ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సునీత బుల్లితెర కోసం కూడా ప్రత్యేక ప్రోగ్రామ్‌లను ప్లాన్ చేస్తోంది.