సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

"శంకర్ దాదా ఎంబీబీఎస్" గాయకుడు ఇకలేరు

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'శంకర్ దాదా ఎంబీబీఎస్'. ఈ చిత్రంలో 'పట్టుపట్టు చెయ్యేపట్టు' అంటూ సాగే పాటను ఆలపించిన తమిళ సినీ నేపథ్యగాయకుడు, నటుడు మాణిక్య వినాయకం ఇకలేరు. ఆయన శనివారం రాత్రి చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. ఆయనకు వయసు 73 యేళ్లు. 
 
గత 2001లో 'దిల్' అనే చిత్రంలో సినీ నేపథ్యగాయకుడుగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన... తెలుగు, తమిళంతో పాటు.. పలు భాషల్లో కలిపి దాదాపు 2 వేలకు పైగా పాటలను పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపద, భక్తి గీతాలను ఆలపించారు. 
 
ఒక్క గాయకుడుగానే కాకుండా నటుడుగా కూడా రాణించారు. పలు చిత్రాల్లో ఆయన మంచి పాత్రలను పోషించారు. మాణిక్య వినాయగం మృతిపట్ల ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్ విచారాన్ని వ్యక్తం చేశారు. అలాగే, సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.