1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Singareni worker dies in mine accident

సింగరేణిలో ప్రమాదం : డంపర్ ఆపరేటర్ కన్నుమూత

Singareni Worker
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గుగనుల్లో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో పలువురు కార్మికులు మృత్యువాతపడుతున్నారు. ఇది కార్మికులతో పాటు వారి కుటుంబాల్లో ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఇందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామగుండం పరిధిలోని సింగరేణి ఆర్జీ 3లోని ఓసీపీ-1లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. డంపర్‌ను మరో డంపర్ ఢీకొట్టింది. దీంతో ఒక డంపర్ ఆపరేటర్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే సింగరేణి అధికారులు హుటాహుటిన ప్రమాదస్థలానికి చేరుకుని, అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆపరేటర్ శ్రీనివాస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరణ వార్త తెలియగానే మృతుని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 
తర్వాతి కథనం
యూకేలో ఒమిక్రాన్ అల్లకల్లోలం - 24 గంటల్లో లక్ష కరోనా కేసులు