సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (13:55 IST)

కల్వర్టును ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఆదివారం జరిగిన ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే, రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో జరిగే ఓ శుభకార్యానికి ఓ కారులో బయలుదేరారు. 
 
వీరు ప్రయాణిస్తున్న కారు ములుగు జిల్లాలోని మంగంపేట మండల కేంద్రంలోని గంపలగూడెం మార్కెట్‌ గోడౌన్స్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఓ కారు వేగంగా వస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. 
 
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన నలుగురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా వుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.