శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శనివారం, 18 డిశెంబరు 2021 (14:21 IST)

మంత్రిగారు.. ఏం డ్యాన్సు.. ఏం డ్యాన్సు.. ఇరగదీశారుగా..!

ఆయన విద్యాశాఖా మంత్రి. కూతురుకు పెళ్ళి చేస్తున్నారు. ఇందులో తప్పేముంది అనుకోవచ్చు. పెళ్ళి జరగడం మామూలేగా. అయితే పెళ్ళి చేసే ముందు జరిగిన రిసెప్షన్లో మంత్రివర్యులు ఇలా చేసారు.

 
విజయవాడ వేదికగా కళ్యాణమండపంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. అయితే రిసెప్షన్లో మంత్రిగారు డ్యాన్స్ చేశారు. వచ్చీరానీ స్టెప్పులతో హమ్ చేశారు. స్టేజ్ కింద ఉన్నవారు ఈలలు వేస్తూ గోల గోల చేశారు. తాను మంత్రినన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారేమో సదరు మంత్రిగారు. చిన్న పిల్లాడిలా ఆయన చేసిన డ్యాన్సు అందరినీ ఆకట్టుకుంది.