బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 14 డిశెంబరు 2021 (23:04 IST)

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం, వేగం ఎక్కువై...

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అతి వేగంగా ఘాట్ రోడ్డులో పక్కనున్న గ్రిల్స్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో భక్తులకు గాయాలయ్యాయి. మొదటి ఘాట్ రోడ్డులోని వినాయకుడి గుడి దగ్గర ప్రమాదం జరిగింది.

 
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. దర్సనం తరువాత కారులో మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులు తిరుపతికి బయలుదేరారు. సరిగ్గా వినాయకుడి గుడి దగ్గరకు రాగానే కారు అదుపు తప్పింది.

 
అతి వేగంగా వస్తుండటంతో పక్కనే ఉన్న గ్రిల్స్ ను కారు ఢీకొంది. దీంతో అందులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన భక్తులను హుటాహుటిన తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు వేగం మరింత పెరిగి ఉంటే గ్రిల్స్‌ను దాటి పిట్టగోడను ఢీకొని అటువైపుగా అటవీ ప్రాంతంలో పడిపోయే ఉండేదని టిటిడి సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు.