బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 12 డిశెంబరు 2021 (21:04 IST)

ఆగి వున్న లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి

రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది. తెలంగాణలోని దుండిగల్ బౌరంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో వున్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు.

 
శనివారం అర్థరాత్రి దుండిగల్ బౌరంపేటలో కోకాకోలా కంపెనీ వద్ద ఆగి వున్న లారీని కారు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. దీనితో కారు నుజ్జునుజ్జయింది. అందులో వున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.