శనివారం, 12 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (22:25 IST)

టాలీవుడ్‌లో మరో విషాదం: రోడ్డు ప్రమాదంలో జక్కుల మృతి

jakkula nageswararao
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. డబ్బింగ్ చిత్రాల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న జక్కుల నాగేశ్వరరావు ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వరరావు  అక్కడిక్కడే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. 
 
జక్కుల నాగేశ్వరరావు లవ్ జర్నీ, వీడు సరైనోడు, అమ్మా నాన్నా ఊరెళితే వంటి చిత్రాలను తెలుగులో విడుదల చేశారు. జక్కుల మృతితో చిత్ర పరిశ్రమలో మరోసారి విషాదం అలముకుంది. 
 
ఇప్పటికే శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ప్రముఖులు మరణించిన నేపథ్యంలో.. జక్కుల కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం టాలీవుడ్‌ను శోకసంద్రంలో ముంచిందనే చెప్పాలి.