మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (19:22 IST)

ఆన్‌లైన్‌లో పెద్దలు టిక్కెట్లను బ్లాక్ చేసే అవకాశం వుంది.. మౌనం వీడిన కె.రాఘవేంద్ర రావు

సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, థియేటర్లలో టిక్కెట్ రేట్లను నిర్ణయించడంపై టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎల్లపుడు మౌనమునిగా ఉండే రాఘవేంద్ర రావు ప్రభుత్వ నిర్ణయంపై ఆయన అభిప్రాయాలను నిర్భయంగా ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 
 
ఆన్‌లైన్ విధానం ద్వారా దోపిడీ ఆగిపోతుందనడం సరికాదన్నారు. ఒక ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడదలచుకుంటే టిక్కెట్ ధర రూ.300 లేదా రూ.500 వెచ్చించి అయినా కొనుగోలు చేస్తాడన్నాడు. అదే అతనికి నచ్చని సినిమా అయితే, సినిమా టిక్కెట్ రూపాయికే ఇచ్చినా చూడడని వివరించారు.
 
ముఖ్యంగా ఆన్‌లైన్ విధానంలో చాలా మంది పెద్ద మనుషులు తమ పరపతిని ఉపయోగించి టిక్కెట్లను బ్లాక్‌ చేసుకునే అవకాశం ఉందని, అదే ఆన్‌లైన్‌లో రేట్లు పెంచి టిక్కెట్లు అమ్మితే ప్రభుత్వానికి కూడా అధిక పన్ను వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.