మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (15:47 IST)

లాంఛనంగా ప్రారంభ‌మైన మెగాస్టార్ చిరంజీవి 154వ‌ చిత్రం

Chiranjeevi 154th Movie opening
మెగాస్టార్ 154 వ చిత్రాన్ని టాలీవుడ్ అగ్రగామి నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. మాస్ అండ్ ర‌గ్డ్ అవ‌తారంలో చిరంజీవి మూల విరాట్ ని చూసి అందరూ ఫిదా అయ్యారు. క్షణాల్లో ఆ పోస్టర్ వైరల్ అయింది.
 
శనివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కే రాఘవేంద్ర రావు, వివి వినాయక్, పూరి జగన్నాథ్, కొరటాల శివ, ఛార్మీ, హరీష్ శంకర్, శివ నిర్వాణ, బుచ్చి బాబు, బీవీఎస్ రవి, నాగబాబు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.
 
మొదటి షాట్‌కు వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా పూరి జగన్నాథ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కొరటాల శివ, హరీష్ శంకర్, మెహర్ రమేష్, బుచ్చి బాబు, శివ నిర్వాణ ఇలా అందరూ కలిసి స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేశారు. ముహూర్తపు షాట్‌కు ద‌ర్శ‌కేంద్రుడు కే రాఘవేంద్ర రావు గౌర‌వ దర్శకత్వం వహించారు.
 
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ తారాగణం, సాంకేతిక బృందం ఈ చిత్రంలో భాగం కానుంది.
 
మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండ‌గా, ఆర్థర్ ఏ విల్సన్ కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. నిరంజన్ దేవరమనే ఎడిటర్‌, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌, సుష్మిత కొణిదెల క్యాస్టూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.
 
కథ, మాటలు బాబీ రాయగా.. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లేను అందించారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రచనా సహకారం అందించారు. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి.
 
డిసెంబర్‌లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
 
సాంకేతిక బృందంః  కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ),  నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్,  సీఈవో: చెర్రీ,  సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్,  కెమెరాః ఆర్థర్ ఏ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమనే,  ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, సహ నిర్మాత: జీకే మోహన్