మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (14:03 IST)

'వాల్తేర్ వీరయ్య'గా చిరంజీవి - 15 నుంచి 'భోళా శంకర్' షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు పోటీగా కొత్త చిత్రాల్లో కమిట్ అవుతున్నారు. మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌కా తెరకెక్కిస్తున్న 'గాడ్ ఫాదర్' చిత్రంలో నటిస్తున్న ఆయన ఆ తర్వాత 'భోశా శంకర్' అనే చిత్రంలో నటించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభంకానుందని ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. 
 
న‌వంబ‌రు 11వ తేదీన మూవీ పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని, 15 నుండి షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తెలియ‌జేశారు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా ఎంపికైన‌ట్టు స‌మాచారం. అయితే, మళ్లీ ఆమెను తొలగించారనే ప్రచారం సాగుతోంది. ఇదిలావుంటే, ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
మరోవైపు, బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను చిరు ఓ సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది ఏ సినిమాకి రీమేక్ కాదు .. కథ ఇక్కడ పుట్టి పెరిగిందే. దీనిని అద్భుతంగా తెర‌కెక్కించబోతున్నాడు బాబీ.