గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (11:22 IST)

తమన్నాకు షాకిచ్చిన 'భోళా శంకర్' చిత్రబృందం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా చకచకా షూటింగును జరుపుకుంటోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
 
ఈ చిత్రం చిరంజీవి మరో చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ చిత్రం టైటిల్‌ను  భోళా శంకర్‌గా ఖరారు చేశారు. మెహర్ రమేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అనిల్ సుంకర నిర్మించనున్న ఈ సినిమా కోసం కథానాయికగా తమన్నాను తీసుకున్నారు. గతంలో 'సైరా' సినిమాలో సాహసోపేతమైన పాత్రలో తమన్నా నటించిన సంగతి తెలిసిందే.
 
గ్లామర్ పరంగా.. క్రేజ్ పరంగా తమన్నా మార్కులు ఇంతవరకూ తగ్గలేదు. అలాంటి తమన్నాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆమెతో కలిసి స్టెప్పులు వేయాలని ఉందని గతంలో చిరంజీవి ఒక వేదికపై చెప్పారు. 
 
అలాంటిది ఇప్పుడు తమన్నాను తప్పించారని అంటున్నారు. కారణాలు మాత్రం తెలియదు. జోరుగా జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి.