గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (11:43 IST)

భోళా శంకర్‌ నుంచి తాజా అప్డేట్: చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్

Bhola Shankar
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రమే "భోళా శంకర్‌". తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్‌గా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించబోతోంది.
 
అయితే ఈ చిత్రం ఇప్పట్లో ప్రారంభం అవ్వదని.. మొదట బాబి దర్శకత్వంలో సినిమా చేశాకే భోళ శంకర్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారని గత కొద్ది రోజుల నుంచీ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కానీ, తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలను 11-11-2021 తేదీన ఉదయం గం.7:45నిలకు నిర్వహించబోతున్నట్టు, రెగ్యులర్ షూటింగ్‌ను 15-11-2021 తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
 
ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియా ద్వారా వదిలారు. దాంతో ఈ సినిమాపై జరుగుతున్న రూమర్లకు చిరు చెక్ పెట్టనట్టు అయింది. కాగా, మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా తమన్నా నటించనుందని ప్రచారం జరుగుతోంది.