సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (19:09 IST)

#PelliSandaD టీజర్.. అంచనాలు పెంచేసిందిగా! (Video)

PelliSandaD
సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్-శ్రీలీల జంటగా రాఘవేంద్ర రావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘పెళ్లిసందD’. ఇప్పటికే ఈ మూవీ తాలూకా పాటలు బయటకొచ్చి ఆకట్టుకోగా..ఇక ఇప్పుడు చిత్ర టీజర్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు.
 
ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ , రాజేంద్రప్రసాద్ , రావు రమేష్ , తనికెళ్ళ భరణి , పోసాని కృష్ణ మురళి, హేమ, ప్రగతి, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, ఫిష్ వెంకట్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 
 
శ్రీధర్ సీపాన ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్ – ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టీజర్‌లో తెలిపారు.