గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)
సోషల్ మీడియా పుణ్యంతో ప్రస్తుత యువత పెడదారిన పడుతున్నారు. టీనేజీలోనే చెడు వ్యసనాలకు లోబడి.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాకు, గంజాయికి బానిసై తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో.. ఏది చేసినా కరెక్టేననే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు పోలీసులకు కొడవలితో చిక్కాడు. కొడవలిని వీపులో వుంచుకుని పోలీస్‌ల ఎదుట నానా హంగామా చేశాడు. ఆ వీడియోలోని యువకుడు పోలీసులను ఎదిరించి మాట్లాడటం కనిపిస్తుంది.
ఇంకా గంజాయి మత్తులో ఏవేవో మాట్లాడు బూతులు మాట్లాడాడు. వీడి వ్యవహారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ గంజాయి మత్తులో ఆడపిల్లని ఏమైనా చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వీరికి చట్టప్రకారం శిక్ష పడటంలోనూ జాప్యం ఏర్పడుతుందని.. ఇందుకు మానవ హక్కుల ముసుగు తెరపైకి వస్తుందని నెటిజన్లు అంటున్నారు.