సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (18:51 IST)

ఆరేళ్ల చిన్నారి హత్యాచారం ఘటన.. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలి..?

mallareddy
హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితుడు రాజుని ఎన్‌కౌంటర్ చేస్తామని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు.

తెలంగాణలో సంచలనం రేపుతున్న ఆరేళ్ల చిన్నారి హత్యాచారం ఘటనపై మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ... చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని వ్యాఖ్యానించారు. నిందితుడిని పట్టుకుని కచ్చితంగా ఎన్ కౌంటర్ చేస్తామని తెలిపారు. త్వరలోనే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తామన్నారు.
 
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు పది బృందాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిందితుడి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు.

కాగా, గతంలో దిశ హత్యాచారం ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఘటనలోనూ నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తామంటూ మంత్రి మల్లారెడ్డి స్టేట్మెమెంట్ ఇవ్వడం చర్చనీయంశమైంది.