శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (21:07 IST)

మంత్రి హరీష్ రావు ఓ రబ్బర్ స్టాంప్: ఈటల ఫైర్

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. మంత్రి హరీష్ రావు ఓ రబ్బర్ స్టాంప్ అని మండిపడ్డారు.. నేను సీఎం కావాలని అనుకున్నానా..? గుండె మీద చెయ్యి వేసి చెప్పు హరీష్ రావు ? అని సవాల్ విసిరారు ఈటల రాజేందర్. అడుగులకు మడుగులు ఒత్తితేనే ప్రగతి భవన్కు ఎంట్రీ అని పేర్కొన్నారు.
 
తాను రాజీనామా చేయలేదని.. తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చెయ్యిమంటేనే చేశానని ఫైర్ అయ్యారు. మంత్రి హరీష్ రావు లాగా వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదని .. హరీష్‌కు ఆయన మామ ఉన్నాడని చురకలు అంటించారు. 
 
హుజురాబాద్ ఎన్నిక రిహార్సల్ మాత్రమేనని.. తన గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు ఈటల రాజేందర్. తన ను ఓడించేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారని.. అవేం పని చేయబోవని ఈటెల ధీమా వ్యక్తం చేశారు.