శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

యూపీలో అధికార బీజేపీ నేత దారుణ హత్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీజేపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన పేరు ఆత్మారామ్ తోమర్. వయసు 75 యేళ్లు. ఈయన అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. 
 
యూపీలోని బాగ్‌పత్ జిల్లా బారౌత్ బిజ్రాల్ రోడ్‌లోని ఆయన నివాసంలో గురువారం అర్థరాత్రి చనిపోయి ఉండటం కలకలం రేపింది. అయితే మెడకు టవల్ కట్టి ఉండటంతో ఎవరైనా హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
అదేసమయంలో ఇంట్లో ఉన్న స్కార్పియో వాహనం కనిపించకుండా పోయింది. దీంతో ఆయనది హత్యే అనే అనుమానానికి బలం చేకూరుతోంది. ఆయన్ను హత్య చేసి స్కార్పియో కారును చోరీ చేసినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, పోలీస్‌ ఉన్నతాధికారులు డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఇంటి తలుపు బయటి నుండి లాక్ చేసి ఉన్నట్టు జిల్లా ఎస్‌పీ నీరజ్ కుమార్ జడౌన్ తెలిపారు.