బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (11:24 IST)

కేంద్ర మంత్రికి, ఆయన ఫ్యామిలీకి లుకౌట్ నోటీసులు

రుణం తీసుకుని ఎగ్గొట్టిన కేసులో కేంద్ర మంత్రి కుటుంంబానికి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆ కేంద్ర మంత్రి ఎవరో కాదు.. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారాయణ్ రాణె. ఈయన భార్య నీలమ్, ఎమ్మెల్యే అయిన వారి కుమారుడు నీతేశ్‌ రాణెలు దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. 
 
దేశంలోని ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో ఈ నోటీసులు జారీ చేసినట్టు పూణె పోలీసు అధికారులు తెలిపారు. నీలమ్, నీతేశ్‌లు తమకు చెందిన వివిధ సంస్థల తరపున ఓ ఫైనాన్షియల్ సంస్థ నుంచి తీసుకున్న రుణాల్లో దాదాపు రూ.61 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. 
 
రుణాలు పొందిన సమయంలో చూపిన రుణాల ఖాతాలను నిరర్థక ఆస్తులుగా పేర్కొనడంతో రుణాలిచ్చిన సంస్థ కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఆదేశాలతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఘాడ్జ్ తెలిపారు.