శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (16:13 IST)

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ అరోన్ ఫించ్ తండ్రి అయ్యాడోచ్..

Aron pinch
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ అరోన్ ఫించ్ తండ్రి అయ్యాడు. అతడి భార్య అమీ ఫించ్‌ మంగళవారం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పాపకు ఎస్తేర్‌ కేట్‌ ఫించ్‌గా నామకరణం కూడా చేశారు. ఈ విషయాన్ని ఆరోన్‌ ఫించ్‌.. సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు చెప్పాడు.
 
'ఎస్తేర్‌ కేట్‌ ఫించ్‌.. ఈ అందమైన ప్రపంచంలోకి స్వాగతం. మా చిన్న రాకుమారి నిన్న సాయంత్రం 4 గంటల 58 నిమిషాల సమయంలో జన్మించింది. ఆమె 3.54 కిలోల బరువు ఉంది. అమీ, బేబీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు` అని భార్యాబిడ్డలతో దిగిన ఫొటోలను ఆరోన్‌ ఫించ్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.