ఆస్ట్రేలియాలో తొలి వన్డే.. 66 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ పోరాడి ఓడింది. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 375 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 50ఓవర్లకి ఎనిమిది వికెట్లు కోల్పోయి 308 పరుగుల చేయడంతో ఆసీస్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత బ్యాట్స్‌మెన్‌లలో, హార్దిక్ పాండ్యా (90), శిఖర్ ధావన్ (74) పరుగులు చేయగా మిగత బ్యాట్స్ మెన్లు తక్కువ స్కోరుకే వేనుదిరిగారు. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో ఫించ్ (114), స్మిత్ (105) సెంచరీలు చేయగా వార్నర్ 69, మ్యాక్స్‌వెల్ 45 పరుగులతో రాణించారు.
ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ తడబడింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులకే పరిమితమై.. 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 101 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా హార్దిక్ పాండ్యా, ధావన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వారి పోరాటం కారణంగా భారత స్కోర్ 250 పరుగులు దాటగలిగింది.
మిడిలార్డర్ చేతులు ఎత్తేయడంతో లక్ష్యాన్ని ఛేధించడంలో భారత్ విఫలమైంది. 375 పరుగుల భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు తొలి ఓవర్‌లోనే శుభారంభం దక్కింది. మిచెల్ స్టార్క్ వేసిన ఆ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్లలో స్టార్క్ 8 వైడ్ల వేశాడు. దాటిగా ఆడుతూ భారత ఓపెనర్లు మంచి శుభారంభం చేశారు.దాటిగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌కు హాజిల్‌వుడ్ బ్రెక్ వేశాడు.
అతను వేసిన ఆరో ఓవర్‌లో మయాంక్ అగర్వాల్(22) ఔటయ్యాడు. దీంతో భారత్ 53 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరోసారి హేజిల్‌వుడ్ భారత్ ఇన్సింగ్స్‌ను దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో రెండు కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థి దెబ్బతీశాడు. భారత సారథి విరాట్ కోహ్లీ (21; 21 బంతుల్లో 2×4, 1×6),శ్రేయస్ అయ్యర్ (2)ను ఔట్ చేసి భారత్‌ను ఆత్మ రక్షణలో పడేశాడు.
ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్(12) కూడా నిరాశపరిచాడు. ఆ తర్వాత వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హిట్టింగ్ బ్యాటింగ్‌తో టీ20 ఫార్మాట్ తరహాలో రెచ్చిపోయాడు. అతనికి ధావన్ చక్కటి సహకారం అందించాడు. చివరికి వీరిద్దరూ ఔటవ్వడంతో భారత్ గెలుపుపై ఆశలు వదులుకుంది. చివరకు భారత్ చివరి 50 ఓవర్లో 308 పరుగులు చేసింది.
అంతకుముందు ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరోన్ ఫించ్ (114; 124 బంతుల్లో 9x4, 3x6), డేవిడ్ వార్నర్ (69; 76 బంతుల్లో 6x4), స్టీవ్‌స్మిత్ (101; 66 బంతుల్లో 11x4, 4x6), గ్లెన్ మాక్స్‌వెల్ (45; 19 బంతుల్లో 5x4, 3x6) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. ఇక టీమిండియా బౌలర్లలో షమి 3 వికెట్లు పడగొట్టగా... బుమ్రా, సైని, చాహల్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.