శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (13:16 IST)

తమిళనాడు మాజీ సీఎం ఓపీఎస్‌కు సతీవియోగం : సీఎం స్టాలిన్ పరామర్శ

తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త ఓ. పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి బుధవారం హఠాత్తుగా మరణించారు. ఆమెకు వయసు 63 సంవత్సరాలు. 
 
బుధవారం ఉదయం ఆమెకు గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజయలక్ష్మి కన్నుమూశారు. దీంతో పన్నీర్‌సెల్వం ఇంట విషాదం నెలకొంది. కాగా పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మీ మృతి పట్ల పలువురు ప్రముఖులు మాజీ సీఎంకు సానుభూతి ప్రకటించారు.
 
ముఖ్యంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్వయంగా ఓపీఎస్ నివాసానికి వెళ్లి విజయలక్ష్మి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అలాగే, భార్యను కోల్పోయి విషాదంలో మునగిపోయిన మాజీ సీఎం ఓపీఎస్‌ను పరామర్శించి, ఓదార్చారు.