మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (12:32 IST)

శశికళ రీఎంట్రీ : బీజేపీ ప్రయత్నాల్లో వివేకం - భవిష్యత్ విజ్ఞత ఉంది : విజయశాంతి

త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియ నెచ్చెలి శశికళ మ‌ళ్లీ అన్నాడీఎంకేలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 
 
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ‌శికళ అన్నాడీఎంకేలో ఉండాలని బీజేపీ అధిష్టానం చేసిన ప్రయత్నంలో వివేకం, భవిష్యత్ విజ్ఞత ఉన్నాయ‌న్నారు. 
 
ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకించిన అన్నాడీఎంకే నేతలు పొరపాటు చేసినట్లు భావిస్తున్న ధోరణి నేటి వార్తలలో కనిపిస్తోందని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఏది ఏమైనా తమిళనాట ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని కోరుకుంటున్నానని విజ‌య‌శాంతి తెలిపారు.  
 
కాగా, అక్రమాస్తుల కేసులో నాలుగున్నరేళ్ళ జైలుశిక్షను అనుభవించిన శశికళ... ఇటీవలే విడుదలయ్యారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టి చక్రం తిప్పుతారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆమె ప్రతి ఒక్కరికీ షాకిస్తూ క్రియాశీలక రాజకీయా నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. ఆమె తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక బీజేపీ హస్తముందనే ప్రచారం లేకపోలేదు.