1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (10:27 IST)

తెలంగాణలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 493 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 493 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాని ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,04,791కు పెరిగింది. మరో నలుగురు మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 1,680కు చేరింది. తాజాగా 157 మంది డిశ్చార్జి అవగా ఇప్పటి వరకు 2,99,427 మంది కోలుకున్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 3,684 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. 1616 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో 138 పాజిటివ్‌ కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే రికార్డయినట్లు పేర్కొంది. గత వారం రోజులుగా జీహెచ్‌ఎంసీలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒకే రోజు రాష్ట్రంలో 56,464 పరీక్షలు చేసినట్లు వివరించింది.