శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (06:42 IST)

దంచి కొడుతున్న ఎండలు.. రాగల మూడు రోజుల్లో..?

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అధికమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే మార్చిలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. గురువారం రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.6 నుంచి 40.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.

జగిత్యాల 40, వనపర్తి 39.5, మంచిర్యాల 39, మహబూబ్‌నగర్‌, నారాయణపేటలో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఖైరతాబాద్‌ గణాంక భవన్‌, ఆసిఫ్‌నగర్‌లో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 
 
వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌లో చిరు జల్లులు కురిశాయి. బుధవారం ఆగ్నేయ మధ్యప్రదేశ్‌, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీపడింది.

రాయలసీమ నుంచి కోస్తా ఆంధ్రా తీరం మీదుగా దక్షిణ ఒడిశా వరకు 0.9 కిలోమీటర్ల వద్ద గాలి విచ్ఛిన్నతి ఏర్పడిందని, దీంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.