శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (17:25 IST)

గుజరాత్ సీఎం పదవీకి విజయ్ రూపానీ రాజీనామా.. ఎందుకు?

Vijay Rupani
గుజరాత్ సీఎం పదవీకి విజయ్ రూపానీ రాజీనామా చేశారు.. 2016 నుంచి గుజరాత్ సీఎంగా ఉన్న ఆయన.. గవర్నర్‌కు లేఖ సమర్పించారు.. దాంతో డిప్యూటీ సీఎం సంతోష్ భూపేంద్ర గవర్నర్ నివాసానికి చేరుకున్నారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికిప్పుడు విజయ్ రూపానీ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
ఇటీవల కాలంలో రాజీనామా చేసిన నాలుగో బీజేపీ సీఎం విజయ్ రూపానీ. జులైలో కర్ణాటక సీఎం పదవికి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయగా, ఉత్తరాఖండ్ లో తీర్థ్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవి నుంచి వైదొలిగారు. తాజాగా, విజయ్ రూపానీ సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి దారితీసిన కారణాలు ఏంటన్నది తెలియరాలేదు.