శుక్రవారం, 8 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 7 ఆగస్టు 2025 (19:14 IST)

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

NTR, Hrithik, War 2 Song
NTR, Hrithik, War 2 Song
YRF నిర్మాణంలో ఆదిత్య చోప్రా భారీ ఎత్తున నిర్మించిన చిత్రం ‘వార్ 2’. ఇండియన్ ఐకానిక్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లను అద్భుతంగా చూపిస్తూ అయాన్ ముఖర్జీ తీసిన  ‘వార్ 2’ ఆగస్ట్ 14న థియేటర్లోకి రానుంది. ఇప్పటి వరకు ‘వార్ 2’ నుంచి వదిలిన కంటెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వార్ 2 టీజర్, గ్లింప్స్, రొమాంటిక్ సాంగ్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ‘వార్ 2’ మీద మరింత హైప్ పెంచేసింది చిత్రయూనిట్.
 
‘వార్ 2’ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ కలిసి స్టెప్పులు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులు నుంచి ఈ పాట గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇండియాలోని ది బెస్ట్ డ్యాన్సింగ్ సూపర్ స్టార్స్ ఒకే సారి కలిసి స్టెప్పులు వేస్తే తెర చిరిగిపోవాల్సిందే అన్నట్టుగా ఈ కొత్త పాట ఉంది. ‘సలామే అనాలి’ (హిందీలో ‘జనాబ్ ఈ అలీ’) అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన చిన్న గ్లింప్స్‌ను వదిలి ఒక్కసారిగా హీట్ పెంచేశారు.
 
‘జనాబ్ ఈ అలీ’ అనే ఈ పాటను పూర్తిగా చూడాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. అంత వరకు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఇలా గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్, హృతిక్‌లను చూస్తే, వారు వేసిన స్టెప్పుల్ని చూస్తే వావ్ అనాల్సిందే. బాడీని స్ప్రింగుల్లా తిప్పేస్తున్నారు. ఇక ఈ గ్లింప్స్ చూస్తుంటే పాట ఇంకే లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
 
‘జనాబ్ ఈ అలీ’ అనే పాటను ప్రీతమ్ కంపోజ్ చేశారు. అమితాబ్ భట్టాచార్య సాహిత్యాన్ని అందించారు. సాచెట్ టాండన్, సాబ్ భట్టాచార్య సంయుక్తంగా ఆలపించారు. ఇక తెలుగులో ‘సలామే అనాలి’ అంటూ సాగే పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. నకాష్ అజిజ్, యాజిన్ నిజార్ ఆలపించారు. ఇక ఈ పాటకు బోస్కో లెస్లీ మార్టిస్ అద్భుతమైన స్టెప్పుల్ని కంపోజ్ చేశారు. ఆగస్ట్ 14న ‘వార్ 2’ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.