అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)
తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో అందరూ చూస్తుండగానే హైకోర్టు న్యాయవాది పర్సా అనంత నాగేశ్వర రావు గుండెపోటుతో మృతి చెందారు. గురువారం నాడు మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టులో న్యాయవాదులు, హైకోర్టు స్టాఫ్, క్లైంట్స్ చూస్తుండగానే మాజీ స్పెషల్ జిపి, ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన హైకోర్టు న్యాయవాది శ్రీ పర్సా అనంత నాగేశ్వర్ రావు గారు గుండెనొప్పితో కుప్పకూలి చనిపోయారు.
ఎంతో భవిష్యత్తు వున్న అనంత నాగేశ్వ రావు ఇలా అర్థాంతరంగా మృతి చెందడంపై ఆయన సహచరులు ఎంతో ఆవేదన చెందారు. వృత్తిలో ఎదుగుతున్న స్థితిలో ఈ విధంగా ఆయన చనిపోవడం చాల బాధాకరమనీ, నాగేశ్వరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు పలువురు న్యాయవాదులు వెల్లడించారు.