ఆదివారం, 10 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఆగస్టు 2025 (09:54 IST)

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

prostitution
హైదరాబాద్ నగరంలోని ఓ స్పా సెంటరులో రహస్యంగా సాగిస్తూ వచ్చిన వ్యభిచార గుట్టును పోలీసులు ఛేదించింది. ఈ కేసులో ఓ కస్టమర్‌తో సహా ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. అలాగే, స్పా సెంటర్ నిర్వాహకుడుని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు... ప్రత్యేక బృందం పోలీసులు స్పా సెంటరుపై దాడి చేసి, వ్యభిచార రాకెట్‌ను బహిర్గతం చేసి, ఇద్దరు యువతులు, ఒక కస్టమర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 
పోలీసులు జరిపిన విచారణలో ప్రధాన నిందితురాలు స్వప్న, ఆమె సహచరులు నవీన్, అశోక్ కుమార్‌తో కలిసి ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్టు తేలింది. వీరు మసాజ్ సెంటర్‌ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ రహస్యంగా వ్యభిచార దందా నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
ఈ ముఠా సభ్యులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యువతులు, మహిళలను ఆకర్షించి, అధిక మొత్తంలో వేతనాలు, కమిషన్లు ఆశ చూపి ఈ వ్యభిచార రొంపిలోకి దించుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.