1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (19:01 IST)

అంతర్జాతీయ క్రికెట్‌కు లసిత్‌ మలింగ బైబై

శ్రీలంక క్రికెట్‌ జట్టు దిగ్గజ క్రికెటర్‌, యార్కర్‌ కింగ్‌ లసిత్‌ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పాడు. క్రికెట్‌‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు తన సోషల్‌ మీడియా వేదికగా లసిత్‌ మలింగ్‌ స్పష్టం చేశారు.

తాను క్రికెట్‌ ఆడకున్నా… ఆటపై ప్రేమ అలాగే ఉంటుందని తెలిపారు లసిత్‌ మలింగ. క్రికెట్‌ ఆడకున్నా… ఆ ఆట కోసం మరింత కృషి చేస్తానని ప్రకటించాడు. 17 సంవత్సరాల క్రికెట్‌ అనుభవం తో కుర్ర క్రికెటర్ల కు పాఠాలు చెబుతానని స్పష్టం చేశాడు లసిత్‌ మలింగ. 
 
కాగా.. లసిత్‌ మలింగ తన అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఏకంగా 30 టెస్ట్‌ లు, 226 వన్డేలు, 83 టీ 20 మ్యాచ్‌ లు మరియు 122 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌‌లు ఆడాడు.

అంతే కాదు… ఇప్పటి వరకు 500 పైగా వికెట్లు పడగొట్టాడు లసిత్‌ మలింగ. కాగా.. ఇటీవలే.. డేల్‌ స్టెయిన్‌ క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన సంగతి తెలిసిందే.