శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (17:57 IST)

క్రికెట్‌కు స్టెయిన్ గుడ్ బై.. బంతిని బులెట్‌లా 150 kmph..?

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డెయిల్ స్టెయిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అలాగే తన క్రికెట్ కెరీర్ గుడ్ బై చెప్పుతున్నట్లు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో 150 kmph వేగంతో బంతిని బులెట్‌లా బ్యాట్స్‌మెన్‌కి సంధించగలడు. 
 
ఈ ఫాస్ట్ బౌలర్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా జట్టు తరపున అన్ని ఫార్మెట్లలో కలిపి దాదాపుగా 265 మ్యాచ్‌లు ఆడిన 38 ఏళ్ళ స్టెయిన్ 699 వికెట్లు సాధించిన స్టెయిన్ తన 20 ఏళ్ళ క్రికెట్ కెరీర్‌కి వీడ్కోలు చెప్పి క్రీడాభిమానులకు షాక్ ఇచ్చాడు. 
 
ప్రస్తుతం ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరపున ఆడుతున్న స్టెయిన్ 2008లో ప్రారభం అయిన తన ఐపీఎల్ కెరీర్‌లో 95 మ్యాచ్ లు ఆడి 97 వికెట్లను పడగొట్టాడు.