సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జులై 2021 (16:51 IST)

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. 61ఏళ్లకు విరమణ వయస్సు పెంపు

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 26వ తేదీన జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.  
 
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనుంది. 
 
రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.