శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (07:07 IST)

4 కాదు.. 40 పెళ్లిళ్లు చేసుకుంటా.. మీకేం నొప్పా? వనితా విజయకుమార్

తమిళ సీనియర్ నటుడు విజయ కుమార్ కుమార్తెల్లో ఒకరైన వనితా విజయకుమార్ నటుడు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ను పెళ్లి చేసుకున్నట్లు ఇటీవల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నటి వనిత విజయ్ కుమార్ మరోమారు పెళ్లి చేసుకుందని ఇండస్ట్రీలో ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. 
 
ఈ ఫోటోలపై వనితా విజయకుమార్ తాజాగా స్పందించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు తమ పెళ్లి ఫొటోలు కాదని చెప్పింది. పవర్‌స్టార్‌ దర్శకత్వంలో తాను నటిస్తున్న "పికప్‌ డ్రాప్‌" అనే చిత్రానికి సంబంధించిన ఫొటోలని వివరణ ఇచ్చింది.
 
ఈ సందర్భంగా ఆమె మీడియాతో పాటు నెటిజన్లపై మండిపడింది. ఇద్దరు నటీనటులు కలిసి ఫొటోలు తీసుకుని, వాటిని విడుదల చేస్తే పెళ్ళి జరిగినట్టా? ఇలాంటి విషయాలను చర్చనీయాంశం చేయాల్సిన అవసరం లేదన్నారు. 
 
వ్యక్తిగత జీవితంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రం అవసరం. ఒక పురుషుడు నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ రాద్దాంతం చేయరు. ఆ పని ఒక మహిళ చేస్తే మాత్రం వివాదం సృష్టిస్తారు. నేను నాలుగు కాదు… 40 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటాను. అది నా హక్కు. మీకేంటి అభ్యంతరం అంటూ ప్రశ్నించారు. 
 
పైగా, మహిళల గురించి ఈ సమాజం ఇంకా చెడుగా మాట్లాడుతుండటం వల్లే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఒకరితో జీవితాన్ని పంచుకుంటూ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే తప్పు. ఈ మాట ఎందుకు చెపుతున్నానో మీకై అర్థమైవుంటుంద అంటూ ఆమె వ్యాఖ్యానించారు.