సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (17:52 IST)

ఈటలతో వచ్చేది లేదు సచ్చేది లేదు... ఎంపీటీసీ భర్తకు సీఎం ఫోన్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. పైగా, ఈ నియోజకవర్గం నుంచే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలోని ఓ ఎంపీటీసీ భర్తకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఈటల చాలా చిన్నోడని, ఆయనతో వచ్చేది లేదు సచ్చేది లేదన్నారు. 
 
వైగా, ఈటల అంశాన్ని పక్కనపెట్టి దళిత ప్రతినిధులు ప్రగతి భవన్‌కు రావాలని కోరారు. జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ భర్తకు ఫోన్ చేసి మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ఎల్లుండి దళితబంధు పథకంపై ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి రావాలని ఆహ్వానించారు.
 
తనుగుల ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామితో మాట్లాడిన సీఎం... ఎల్లుండి హుజురాబాద్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్ బయల్దేరాలన్నారు. రెండేళ్లలో దళితబంధును ప్రపంచవ్యాప్తం చేద్దామని.. దీని ప్రచారం కోసమే గ్రామానికి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను ఎంపిక చేసి పిలుస్తున్నామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.