శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (08:10 IST)

26 నుంచి కొత్త రేషన్ కార్డులు : సీఎం కేసీఆర్ నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 26వ తేదీ నుచి ఈ కొత్త రేషన్ కార్డుల జారీని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 
 
ఇప్పటికే దరఖాస్తు చేసుకుని కొత్త రేషన్ కార్డుకు అర్హత పొందిన వారికి, ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ చేయాలని వెల్లడించారు. జులై 26 నుంచి 31 వరకు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు దిశానిర్దేశం చేశారు. 
 
దాదాపు 4 లక్షల మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించనున్నారు. కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు ఆగస్టు మాసం నుంచే బియ్యం అందజేయాలని సూచించారు. బియ్యం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ను ఆదేశించారు.